నాని కెరీర్లో అత్యధిక షేర్ కలక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీలు ఇవే..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో మూవీ లలో నటించాడు. అందులో ఎన్నో మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకొని భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేశాయి. ఇది ఇలా ఉంటే నాని కెరియర్ లో ఇప్పటి వరకు నటించిన సినిమాలలో అత్యధిక షేర్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసిన టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం.
దసరా : నాని తాజాగా నటించిన ఈ మూవీ మార్చి 30 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకోవడంతో ప్రస్తుతం ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. దానితో ఈ మూవీ కేవలం 5 రోజుల్లోనే 50.48 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసి నాని కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్ లను వసూలు చేసిన మూవీ గా నిలిచింది.
ఎంసీఏ : నాని హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 41 కోట్ల షేర్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది.
నేను లోకల్ : నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 35 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.
జెర్సీ : నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 32.03 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.
నిన్ను కోరి : నాని హీరోగా నివేత తామస్ హీరోయిన్ గా శివ నర్వన దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 28.56 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: