"దసరా" మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ తేదీ ... వేదిక పిక్స్..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని తన కెరీర్ లో ఇప్పటికే ఎన్నో అద్భుతమైన పాత్రలో నటించి నటుడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పరచుకున్నాడు. ఇలా నటుడి గా తన కంటూ ఒక స్థాయిని తెలుగు సినిమా ఇండస్ట్రీcలో ఏర్పరచుకున్న నాని తాజాగా దసరా అనే ఊర మాస్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి డబ్ల్యూ డైరెక్టర్ అయినటు వంటి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా ... మహానటి కీర్తి సురేష్ మూవీ లో నాని కి జోడి గా నటించింది. ఈ మూవీ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున మార్చి 30 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్ లు లభించాయి.
 

అలాగే పాజిటివ్ టాక్ కూడా లభించింది. దానితో ప్రస్తుతం ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు ప్రపంచ వ్యాప్తంగా లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి బ్లాక్ బాస్టర్ మూవీ గా నిలిచిన దసరా మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క సక్సెస్ సెలబ్రేషన్స్ ను నిర్వహించబోతుంది.

అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ను కూడా తాజాగా ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ యొక్క సక్సెస్ సెలబ్రేషన్స్ ను ఏప్రిల్ 5 వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఎస్ ఆర్ ఆర్ గౌట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ... జగిత్యాల రోడ్ ... కరీంనగర్ లో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఈ మూవీ యూనిట్ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: