ప్రభాస్ ... మారుతి మూవీ అన్ని రోజుల భారీ షెడ్యూల్..!

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ ఆఖరుగా టాలెంటెడ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన రాదే శ్యామ్ అనే ప్రేమ కథ చిత్రంలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. యు వి క్రియేషన్ సంస్థ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ లో అందాల ముద్దు గుమ్మ పూజ హెగ్డే ... ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ పోయిన సంవత్సరం భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ అనేక క్రేజీ మూవీ లలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో ఒకటి మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే చిత్ర బృందం ప్రారంభించింది.

ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా భాగం షూటింగ్ కూడా పూర్తి అయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యొక్క కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ మూవీ యొక్క తాజా షెడ్యూల్ షూటింగ్ 10 రోజుల పాటు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ షెడ్యూల్ లో ఈ సినిమాకు సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను చిత్ర బృందం చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి రాజా డీలక్స్ అనే టైటిల్ ను పెట్టే ఉద్దేశంలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్టు ఒక వార్త సోషల్ మీడియాలో చాలా రోజులుగా వైరల్ అవుతుంది. ఈ మూవీ ని దర్శకుడు మారుతి హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: