NBK -108 మూవీని రిజెక్ట్ చేసిన త్రిష.. కారణం..?

Divya
నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో బాలయ్య 108వ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే..ఈ చిత్రం లో హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటిస్తూ ఉండగా బాలయ్య కూతురు పాత్రలో యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. అఖండ, వీరసింహారెడ్డి వంటి వారి బ్లాక్ బస్టర్ విజయాల తర్వాత ఈ సినిమా రాబోతున్నది. ఈ చిత్రంలో బాలకృష్ణ ఆరు పదుల వయసు ఉండే పాత్రలో కనిపించబోతున్నట్లు గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

గడిచిన కొద్దిరోజుల క్రితం నుంచి ఈ సినిమా అప్డేట్ వరుసగా విడుదల అవుతూనే ఉంది.. మొన్నటికి మొన్న శ్రీలీల బాలయ్య సినిమాలో నటించబోతున్నట్లు బాలయ్య హ్యాండ్ పట్టుకొని ఒక ఫోటోలు విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత కాజల్ అగర్వాల్ కూడా అదే స్టైల్ లో ఒక ఫోటోని విడుదల చేసింది. ఈ సినిమా విడుదల తేదీ పోస్టర్ను కూడా చిత్ర బృందం శ్రీరామనవమి పండుగ సందర్భంగా విడుదల చేయడం జరిగింది. ఇక బాలయ్య అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా దసరా పండుగకి విడుదల కాబోతున్నది.
బాలయ్య ,అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రం కావడంతో ఈ సినిమా పూర్తిగా కామెడీ ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతున్నట్లు సమాచారం. అలాగే తెలంగాణ యాసకు సంబంధించి ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో ఈ సినిమాల హీరోయిన్ త్రిష నటించబోతోంది అంటూ వార్తలు వినిపించాయి.. వాస్తవానికి ఈ చిత్రంలో అతిధి పాత్ర కోసం హీరోయిన్ త్రిషను సంప్రదించినట్లు చిత్రం బృందం తెలుస్తోంది కానీ ఏమీ ఈ ఆఫర్లు తిరస్కరించినట్లు సమాచారం. కానీ త్రిష మాత్రం ఈ పాత్రను ఎందుకు తిరస్కరించిందో అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు..మరి ఈ అతిధి పాత్ర కోసం ఎవరిని తీసుకున్నారో తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: