దసరా సినిమాలో వెన్నెల పాత్రను కీర్తి సురేష్ తప్ప ఎవరు చేయలేరా..?

Divya
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సినిమా దసరా. ఇటీవలే ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం లో హీరోగా నాని ,కీర్తి సురేష్ అద్భుతంగా నటించారు. సరికొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాని దర్శకత్వం వహించారు. ఈ సినిమా లో నాని ఒక మాస్ లుక్ లో అదరగొట్టేసారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా విడుదలైన రోజు నుంచి ఇప్పటివరకు మంచి రెస్పాన్స్ లభిస్తూ ఉండడంతో ప్రస్తుతం థియేటర్లో ఏ సినిమా దూసుకుపోతోంది.

ఈ సినిమాలో హీరో హీరోయిన్లు కూడా ఈ గ్లామరస్ పాత్రలో అద్భుతంగా నటించారు. వీరి నటనకు ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. ముఖ్యంగా ధరణి పాత్రలు నాని కెరియర్లో బెస్ట్ ఫర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పవచ్చు. అలాగే వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఈమె పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా ఉండనుందని ఈమె కాకుండా వేరే ఎవరు కూడా ఈ పాత్రకు న్యాయం చేయలేరంటూ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఒక వీడియోని చిత్ర యూనిట్ రిలీజ్ చేయడం జరిగింది.

వెన్నెలాగా కీర్తి సురేష్ ఊర మాస్ డాన్స్ వేసుకుంటూ వీడియోని రిలీజ్ చేయగా ఈ వీడియోలో ఆమె ఎనర్జీని చూసి అందరూ అవాక్కవుతున్నారు. కంటిన్యూగా డాన్స్ చేస్తూ కీర్తి సురేష్ చేసిన రచ్చ మామూలుగా లేదంటూ అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఇక ఈ సినిమాలో ఎమోషన్ పండించిన తీరు కూడా అందరిని ఆకట్టుకుంటోంది .ఈ సినిమాకు సంతోష్ నారాయణ సంగీతాన్ని అందించారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో తెగ వైరాల్ గా మారుతోంది.. ఏది ఏమైనా దాదాపుగా మూడు సంవత్సరాల తర్వాత నాని కెరియర్ లో అత్యధిక బ్లాక్ బాస్టర్ చిత్రంగా దసరా సినిమా నిలిచిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: