ఆదిపురుష్.. చిత్రం అసలు అమ్ముడు పోలేదా..?

Divya
ప్రభాస్ ప్రస్తుతం వరసగా పాన్ ఇండియా చిత్రాలలోనే నటిస్తూ ఉన్నారు.. అలా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఆది పురుష్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నారు.. విజువల్ ఎఫెక్ట్ వర్క్ ప్రస్తుతం ఎక్కువగా జరుగుతోంది సుమారుగా రూ .500 కోట్ల రూపాయల బడ్జెట్ తో T సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ సిరీస్ పై వస్తున్న అత్యధిక భారీ బడ్జెట్ సినిమా ఇదే కావడం గమనార్హం .రామాయణం కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది.

ఇందులో రాముడు గా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడుగా సైఫ్ అలీఖా నటిస్తూ ఉన్నారు.. ఈ చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. మరో రెండు నెలలు మాత్రమే ఈ సినిమా రిలీజ్ కి ఉన్న సమయంలో దర్శకుడు మాత్రం ఈ సినిమా బ్రహ్మోత్సవం అసలు మొదలు పెట్టలేదు. ముఖ్యంగా థియేటర్ బిజినెస్ కూడా ఇప్పటికే పూర్తి అయిపోవాలి కానీ అలాంటిదేమీ జరగలేదు. ఇప్పటివరకు ఈ సినిమా బిజినెస్ కు సంబంధించి ఒక్క డీలు కూడా క్లోజ్ కాలేదని వార్తలు వినిపిస్తున్నాయి.

కనీసం డిజిటల్ రైట్స్ కోసం ఎవరు ముందుకు రాలేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి. విడుదల కోసం కూడా ఎవరు పోటీలో లేరని వార్తలు బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.. అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ గత ఏడాది విడుదల చేశారు. భారీ అంచనాలు పెంచుకున్న ఈ టీజర్ కాస్త వివాదంలో మునగడంతో గ్రాఫిక్స్ పరంగా నాసిరకంగా ఉండడంతో తీవ్రంగా విమర్శలు ఎదురయ్యాయి.. దీంతో మరొక రూ .100 కోట్ల రూపాయలు అదన ఖర్చు చేసి VFX వర్క్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక శ్రీరాముని పండుగ సందర్భంగా విడుదల చేసిన ఒక పోస్టర్ పై కూడా ఏమాత్రం బస్సు క్రియేట్ చేయలేకపోయింది. ఈ సినిమా బిజినెస్ డీల్ పూర్తి కావకపోవడంతో నిర్మాత భూషణ్ కుమార్ కూడా ఇబ్బంది పడుతున్నట్లు బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: