'దసరా' హిట్ తో రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన కీర్తి సురేష్.. ఎన్ని కోట్లంటే..?

Anilkumar
టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో మహానటి తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయిన స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తాజాగా నాచురల్ స్టార్ నాని సరసన దసరా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదలైంది.సంతోష్ నారాయణ్ సంగీతం అందించిన ఈ సినిమాని SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.  పక్కా తెలంగాణ నేటి వీటితో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే రివెంజ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకి మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ లభించింది. 

దీంతో ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దసరా మూవీ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెంట్ టార్గెట్ కు దగ్గరయింది. ఇక ఈ సినిమాలో వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ నటనకు ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. నిజం చెప్పాలంటే కీర్తి సురేష్ దసరా సినిమాలో వెన్నెల పాత్రకు ప్రాణం పోసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషన్స్ సీన్స్ లో తన నటనతో ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది. అటు డీ గ్లామర్ లుక్ లోను ఎంతో అందంగా కనిపించి ఆకట్టుకుంది. ఇక సినిమాలో డాన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

దసరా సినిమా చూసిన ప్రతి ఒక్క ఆడియన్ కీర్తి సురేష్ తీన్మార్ డాన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. అలా దసరా సినిమాతో మళ్లీ చాలా గ్యాప్ తర్వాత బ్లాక్ బస్టర్ అందుకుంది కీర్తి సురేష్.ఇక దసరా సక్సెస్ తో ఇప్పుడు కీర్తి సురేష్ కు వరుస ఆఫర్లు వస్తున్నాయి. దీంతో ఈ ముద్దుగుమ్మ అమాంతం రెమ్యునరేషన్ ని పెంచేసిందట. ఇప్పటివరకు ఒక్కో సినిమాకు మూడు కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకున్న కీర్తి సురేష్ దసరా సక్సెస్ తో ఇప్పుడు ఏకంగా ఐదు కోట్లు డిమాండ్ చేస్తుందని ఫిలిం సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఒక్క హిట్ తోనే కీర్తి సురేష్ రెమ్యూనరేషన్ ని ఓవర్గా పెంచేసింది అంటూ ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలు చర్చించుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: