రష్మిక మందన లేడీ ఓరియంటెడ్ మూవీ అప్పటి నుండి ప్రారంభం..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రష్మిక "ఛలో" మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన విజయాన్ని ... అద్భుతమైన గుర్తింపును దక్కించుకుంది. ఆ తరువాత వరుస విజయలను టాలీవుడ్ ఇండస్ట్రీ లో అందుకున్న ఈ మోస్ట్ బ్యూటిఫుల్ నటి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ తెలుగు లో అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప ది రూల్ అనే మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తో పాటు నితిన్ హీరో గా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న మరో మూవీ లో కూడా హీరోయిన్ గా నటించబోతుంది. ఈ రెండు మూవీ లపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా నెలకొని ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లతో పాటు ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ కు తమిళ సినిమా ఇండస్ట్రీ నుండి ... అలాగే హిందీ సినిమా ఇండస్ట్రీ నుండి కూడా భారీ క్రేజీ సినిమా అవకాశాలు లభిస్తున్నాయి. అందులో భాగంగా ఈ సంవత్సరం ఇప్పటికే రష్మిక "వారిసు" అనే తమిళ మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ మరి కొన్ని రోజుల్లో ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా చేయబోతుంది. రష్మిక మందన నటించబోయే లేడీ ఓరియంటెడ్ మూవీ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ వారు నిర్మించబోతున్నారు. ఈ మూవీ యొక్క లాంచింగ్ కార్యక్రమం ఈ రోజు ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: