రౌడీ హీరో ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. సుకుమార్ ప్రాజెక్ట్ క్యాన్సల్?

praveen
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీకి పరిచయమైన విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరో రేస్ లోకి వచ్చాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలకు దీటుగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు. మొన్నటికి మొన్న లైగర్ అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఎందుకో సరైన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు అని చెప్పాలి. అయితే ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు రౌడీ హీరో. ఇకపోతే టాలీవుడ్ లో లెక్కల మాస్టారుగా పేరు సంపాదించుకున్న సుకుమార్తో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది అన్న విషయం తెలిసిందే.

 అల్లు అర్జున్ తో తీసిన పుష్ప సినిమా పూర్తి అయిన తర్వాత ఇక విజయ్ దేవరకొండ తో సినిమా పట్టాలెక్కుతుందని అందరూ అనుకున్నారు. కానీ పుష్ప సినిమా సూపర్ హిట్ కావడంతో ఇక ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని సుకుమార్ నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో పుష్ప హీట్ తర్వాత సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్గా మారిపోయాడు. దీంతో ఇక సుకుమార్ కి మీడియం బడ్జెట్ లేదా లవ్ స్టోరీ సినిమాలు చేసే ఉద్దేశం లేనట్లు కనిపిస్తుంది. దీనిబట్టి చూస్తే ఇక పుష్ప 2 తర్వాత అటు పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ తో భారీ ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నాడట ఈ లెక్కల మాస్టారు.

 ఈ క్రమంలోనే సుకుమార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో సినిమా పూర్తిగా క్యాన్సిల్ అయిపోయినట్లే అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఎన్నో రోజుల కింద వచ్చినప్పటికీ.. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. దీన్ని బట్టి చూస్తే ఇక ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది అంటూ టాక్ ఒకటి చక్కర్లు కొడుతుంది. ఇది రౌడీ హీరో అభిమానులందరికీ కూడా ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ శివా నిర్వాన దర్శకత్వంలో జరిగే తెరకెక్కుతున్న ఖుషి సినిమాలో సమంతతో కలిసి నటిస్తున్నాడు. తర్వాత జెర్సీ డైరెక్టర్ గౌతం తిననూరితో ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో కూడా ఒక మూవీ లైన్ లో పెట్టేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: