ఈ చిత్రాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదలయ్యుంటే సెన్సేషన్ అయ్యేవా..?

Divya
ఈ మధ్యకాలంలో విడుదలైన చిత్రాలు అన్నీ కూడా ఎక్కువగా పాన్ ఇండియా చిత్రాల వైపే నటీనటులు, దర్శకనిర్మాతలు కూడా మక్కువ చూపుతున్నారు. ఎందుకంటే బడ్జెట్ పరంగా ప్రస్తుతం సినిమాల ధరలు భారీగా పెరిగిపోవడంతో ఇతర భాషలలో కూడా తమ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ సినిమాలను విడుదల చేస్తున్నారు నటీనటులు. ముఖ్యంగా ఈమధ్య చిన్న హీరోలు కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే సినిమాలను విడుదల చేస్తూ ఉన్నారు. టైర్ టు హీరోలు కూడా సినిమాలను విడుదల చేస్తూ కలెక్షన్ల పరంగా అతి తక్కువ సమయంలోనే భారీగా రాబడుతున్నారు

ఇక గతంలో పాన్ ఇండియా లెవెల్లో  ఈ సినిమాలు విడుదల అయ్యి ఉంటే కచ్చితంగా సెన్సేషనల్ అయ్యే అవకాశం ఉన్న చిత్రాలలో రంగస్థలం, జెర్సీ సినిమా కూడా ఒకటి. రంగస్థలం సినిమాని డైరెక్టర్ సుకుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.ఈ చిత్రంలో రామ్ చరణ్ నటన సమంత డీ గ్లామరస్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి.. ముఖ్యంగా పాటలు ఈ సినిమాకి మంచి హైప్ తీసుకోవచ్చాయి. ఈ చిత్రం అప్పట్లోనే కొన్ని కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టినట్లు తెలుస్తోంది.
ఇక నాని నటించిన జెర్సీ చిత్రం కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రం కూడా నాని కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు అప్పట్లోనే రాబట్టినట్లు సమాచారం. కానీ ఎందుకో ఈ రెండు చిత్రాలు కూడా పానీ ఇండియా లెవెల్లో విడుదల చేయలేదు దర్శక నిర్మాతలు. ఒకవేళ ఈ చిత్రాలు అప్పట్లోనే విడుదల చేసి ఉంటే ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసావని అభిమానులు భావిస్తూ ఉన్నారు. జెర్సీ సినిమా ని ఇతర భాషలలోకి రీమిక్స్ చేసి విడుదల చేయక పరవాలేదు అనిపించుకుంది. ఇక ఇంకా రంగస్థలం సినిమాని మాత్రం ఇతర భాషలలో రీమిక్స్ చేయలేదు.. అయినప్పటికీ ఇప్పటికీ పాన్ ఇండియా హీరోగా పేరుపొందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: