సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో అన్ని చిత్రలా ..!!

Divya
ఈ ఏడాది మొదటి నుంచి వరుసగా సినిమాలు విడుదలవుతూ టాలీవుడ్ ప్రేక్షకులను బాగా అలరిస్తూనే ఉన్నాయి చిత్రాలు.. ఈ ఏడాది మొదట్లో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. అలాగే రైటర్ పద్మభూషణ్, వారసుడు, తెగింపు , వినరో భాగ్యము విష్ణు కథ, శోభన్ బాబు శ్రీదేవి, తదితర వంటి సినిమాలు విడుదలై బాగానే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ఇక గత ఏ నెలలో దసరా సినిమాతో కూడా నాని బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.

 ఈ నెలలో ఒకేసారి సినీ ప్రియులకు అదిరిపోయే సినిమాలు విడుదల కాబోతున్నాయి.. రవితేజ నటించిన రావణాసుర చిత్రం.. కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ చిత్రం.. అలాగే డైరెక్టర్ ఏ ఆర్ మురగదాస్ తెరకెక్కిస్తున్న 1947 ఆగస్టు 16న చిత్రం ఏప్రిల్ ఏడవ తేదీన విడుదల కాబోతున్నాయి. అలాగే సమంత నటించిన శాకుంతలం చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది.. నటుడు రాఘవ లారెన్స్ దర్శకత్వంలోనే వస్తున్న రుద్రుడు సినిమా ఏప్రిల్ 14వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇవే కాకుండా సాయి ధరంతేజ్ దాదాపుగా రెండు సంవత్సరాల తర్వాత నటించిన విరూపాక్ష చిత్రం ఏప్రిల్ 21వ తేదీన విడుదల కాబోతోంది. ఇక ఇదే కాకుండా డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వస్తున పొన్నియన్ సెల్వన్ -2 చిత్రం కూడా ఏప్రిల్ 28వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల కాబోతున్నది.

ఈ నెలలో దాదాపుగా పాన్ ఇండియా చిత్రాన్ని ఎక్కువగా విడుదలవుతున్నాయి. మరి ఇందులో ప్రేక్షకులను ఏ చిత్రాలు బాగా ఆకట్టుకుంటాయో తెలియాల్సి ఉంది. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ నుంచి విడుదలైన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ చేయాలని అందుకుంటున్నాయి. ఇవే కాకుండా కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలు కూడా విడుదలవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: