అఫీషియల్ : హిందీలో 4 రోజులు ఆ టికెట్ రేట్ లో "దసరా" మూవీ ప్రదర్శన..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో లలో నాని ఒకరు. నాని కెరియర్ ప్రారంభంలో తక్కువ బడ్జెట్ మూవీ లలో నటించి వాటితోనే అద్భుతమైన విజయాలను అందుకొని ప్రస్తుతం సూపర్ సాలిడ్ క్రేజ్ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం నాని "అంటే సుందరానికి" మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది.
 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సంవత్సరం నాని "దసరా" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ మార్చి 30 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో ఒకే రోజు భారీ ఎత్తున విడుదల అయింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.

ఈ మూవీ లోని నాని నటనకు గాను ... కీర్తి సురేష్ నటనకు గాను ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ప్రస్తుతం హిందీ ప్రేక్షకుల నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా హిందీ వర్షన్ కు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ యొక్క హిందీ వర్షన్ టికెట్ ధరను 112 రూపాయలకే సోమవారం నుండి గురువారం వరకు ఉండనున్నట్లు ... ఈ 4 రోజుల్లో ఎవరైనా ఈ మూవీ హిందీ వర్షన్ చూడాలి అనుకున్నట్లు అయితే ఈ ధరకే చూడవచ్చు అని ఈ చిత్ర బృందం ప్రకటించింది. కాకపోతే ఇది కేవలం కొన్ని థియేటర్ లకు మాత్రమే చిత్ర బృందం పరిమితం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: