విజయ్ ... సమంత "ఖుషి" మూవీ లేటెస్ట్ షూటింగ్ అప్డేట్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటు వంటి విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో మహానటి మూవీ రూపొందింది.
మహానటి మూవీ లో వీరు ప్రధాన పాత్రలలో నటించలేదు. వీరిద్దరూ కూడా ఆ మూవీ లో ముఖ్యమైన పాత్రలలో నటించారు. కాకపోతే ఈ మూవీ ద్వారా వీరిద్దరి జంటకు మంచి గుర్తింపు లభించింది.

ప్రస్తుతం రూపొందుతున్న ఖుషి మూవీ వీరిద్దరి కాంబినేషన్ లో రెండవ సినిమా. ఖుషి మూవీ కి శివ నిర్మాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా భాగం చిత్రీకరణ కూడా పూర్తి అయింది.
 ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని సెప్టెంబర్ 1 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ఒకే రోజు విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ యొక్క షూటింగ్ కేరళ లో జరుగుతుంది. కేరళ లో ప్రస్తుతం ఈ మూవీ బృందం సమంత పై కొన్ని కీలక సన్నివేశాలను చత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సన్నివేశాలు ఈ మూవీ లో చాలా కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: