ఫుల్ జోష్ లో ఎన్టీఆర్ 30 మూవీ షూటింగ్..!

Pulgam Srinivas
ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ బ్లాక్ బాస్టర్ విజయం తర్వాత ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ తదుపరి సినిమాకు సంబంధించిన అప్డేట్ ల కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూశారు. అలాంటి సమయం లోనే ఎన్టీఆర్ తన తదుపరి మూవీ ని కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నట్లు ప్రకటించాడు.  అలా ప్రకటించిన తరువాత ఎన్టీఆర్ ... కొరటాల శివ కు సంబంధించిన సినిమా అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

ఈ మూవీ ని మూవీ యూనిట్ ఎన్టీఆర్ 30 అనే టైటిల్ తో ప్రకటించింది. కానీ అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత ఈ సినిమా నుండి చాలా నెలల పాటు ఎలాంటి అప్డేట్ కూడా బయటకు రాలేదు. ఈ సినిమా షూటింగ్ అప్పుడు మొదలు కాబోతుంది ... ఇప్పుడు మొదలు కాబోతుంది అంటూ అనేక తేదీలు నెలలు వార్తల్లోకి వచ్చాయి ... కానీ ఈ సినిమా షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. దానితో ఎన్టీఆర్ అభిమానులు కూడా కాస్త నిరుత్సాహానికి లోనయ్యారు.

ఇది ఇలా ఉంటే ఇలా భారీ ఎదురుచూపుల తర్వాత కొన్ని రోజుల క్రితమే ఎన్టీఆర్ ... కొరటాల కాంబినేషన్ లో రూపొందబోయే  సినిమా పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభం అయింది. ఇలా సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయిన తర్వాత ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ లను ఎప్పటికప్పుడు ఈ చిత్ర బృందం విడుదల చేస్తూనే వస్తుంది. అందులో భాగంగా నిన్ననే ఈ మూవీ షూటింగ్ రాత్రి సన్నివేశాలతో ప్రారంభం అయింది. ఈ చిత్ర బృందం ఇందుకు సంబంధించిన వీడియోను కూడా 5 భాషలలో విడుదల చేసింది.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇలా సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి సమయం పట్టినప్పటికీ సినిమా షూటింగ్ మాత్రం ఫుల్ జోష్ లో ... ఫుల్ స్పీడ్ లి జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా కనిపించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: