తుది దశకు చేరుకున్న రజినీకాంత్ "జైలర్" మూవీ షూటింగ్..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ఆయన కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రజనీ కాంత్ ఇప్పటికే ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించి కేవలం ఇండియా లో మాత్రమే కాకుండా అనేక దేశాలలో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇలా ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ ల ద్వారా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న రజనీ కాంత్ ఈ మధ్య కాలంలో మాత్రం ఆ రేంజ్ సక్సెస్ లను అందుకోవడంలో కాస్త వెనక బడిపోయాడు.

ఆఖరిగా రజనీ కాంత్ నటించిన రోబో 2.0 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఆ తరువాత పలు మూవీ లలో రజనీ కాంత్ నటించినప్పటికీ ఆ మూవీ లు ఏవి కూడా భారీ స్థాయి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రజనీ కాంత్ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

 ఈ మూవీ లో రమ్య కృష్ణ ... తమన్నా ముఖ్య పాత్రలలో కనిపించనుండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి అయింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రస్తుతం తుది దశకు చేరినట్లు తెలుస్తుంది. మరో 8 , 9  రోజుల్లో ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: