రవితేజ "రావణాసుర" మూవీ డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే రవితేజ పోయిన సంవత్సరంలో త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ధమాకా మూవీ తో సూపర్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈ మూవీ లో శ్రీ లీల ... రవితేజ సరసన హీరోయిన్ గా నటించగా ... బీన్స్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ తో సోలో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న రవితేజ ఈ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించాడు.

ఈ మూవీ కూడా మంచి విజయం అందుకుంది. అలాగే ఈ మూవీ లోని రవితేజ పాత్రకు కూడా ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా రవితేజ "రావణాసుర" అనే మూవీ లో హీరో గా నటించాడు. సుదీర్ వర్మ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా బృందం ప్రమోషన్ లను మొదలు పెట్టింది.

అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ కి సంబంధించిన డిజిటల్ హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థలలో ఒకటి అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే రావణాసుర మూవీ పై రవితేజ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: