సౌత్ సినీ ఇండస్ట్రీకి నా ప్రాధాన్యం ... కాజల్ అగర్వాల్..!

Pulgam Srinivas
కళ్యాణ్ రామ్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందిన లక్ష్మీ కళ్యాణం మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లక్ష్మీ కళ్యాణం మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన ఈ ముద్దు గుమ్మ చందమామ మూవీ తో మంచి విజయాన్ని అందుకుంది. మగధీర మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా మారిపోయింది. ఇది ఇలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో భాషల మూవీ లలో నటించి సౌత్ సినిమా ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది.

అలాగే కాజల్ అప్పుడప్పుడు కొన్ని హిందీ మూవీ లలో కూడా నటించి హిందీ ప్రేక్షకులను కూడా అలరించింది. ప్రస్తుతం కాజల్ తెలుగు లో బాలకృష్ణ హీరో గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తో పాటు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న కాజల్ సౌత్ సినిమా ఇండస్ట్రీ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తాజాగా కాజల్ దక్షిణాది సినీ పరిశ్రమకే తాను ప్రాధాన్యత ఇస్తాను అని తెలిపింది. దక్షిణాది లో ఉన్న నైతిక విలువలు మరియు క్రమ శిక్షణ బాలీవుడ్ లో లోపించాయి అని కాజల్ తెలిపింది. తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషలలో ఎంతో మంది గొప్ప టెక్నీషియన్స్ మరియు డైరెక్టర్ లు ఉన్నారు అని కాజల్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: