బాలకృష్ణ ... చిరంజీవి ని "దసరా" మూవీతో దాటేసిన నాని..!

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా వీర సింహా రెడ్డి అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ మొదటి రోజు నైజాం ఏరియాలో 6.21 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా బాబీ దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా ఈ సంవత్సరం జనవరి 13 వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల అయింది. ఈ మూవీ కూడా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ ను తెచ్చుకోవడంతో విడుదల అయిన మొదటి రోజు నైజాం ఏరియాలో 6.10 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. ఇలా ఈ సంవత్సరం ఈ రెండు మూవీ లు నైజాం ఏరియాలో మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేశాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా నాచురల్ స్టార్ నాని ... శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా రుపొందిన దసరా అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ మార్చి 30 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ మొదటి రోజు నైజాం ఏరియాలో ఏకంగా 6.78 కోట్ల షేర్ కలెక్షన్ లను రాబట్టి బాలకృష్ణ ... చిరంజీవి ల సినిమాలను వెనక్కు నెట్టేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: