"గేమ్ చేంజర్" మూవీ విడుదల విషయంలో అలా ప్లాన్ చేస్తున్న మూవీ యూనిట్..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న "గేమ్ చెంజర్" అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కి ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. మోస్ట్ బ్యూటిఫుల్ నటి కియార అద్వానీ ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎస్ జె సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.

శ్రీకాంత్ , సునీల్ , అంజలి ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ చిత్ర బృందం ఈ సినిమా టైటిల్ మరియు ఈ సినిమా నుండి రామ్ చరణ్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ మూవీ బృందం విడుదల చేసిన రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు అనేక వార్తలు వచ్చాయి. కానీ సంక్రాంతి కి ఇప్పటికే అనేక సినిమాల విడుదల తేదీలు ఉండడంతో ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సమ్మర్ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అని వార్తలు వచ్చాయి.

కాకపోతే ఈ చిత్ర బృందం మాత్రం ఈ సినిమాను సంక్రాంతి కంటే ముందు గానే అనగా డిసెంబర్ మొదటి వారంలోనే విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే చరణ్ ... శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: