ఏకంగా అన్ని కోట్ల కలెక్షన్లను ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రాబట్టిన "దసరా" మూవీ..!

Pulgam Srinivas
నాని పోయిన సంవత్సరం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన అంటే సుందరానికి మూవీ తో ప్రేక్షకులను పలకరించి ప్రేక్షకులను అనుకున్నంత రేంజ్ లో అలరించ లేక పోయాడు. అంటే సుందరానికి మూవీ తో ప్రేక్షకులను కాస్త నిరాశపరచిన నాని ఈ సంవత్సరం తాజాగా దసరా అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ నిన్న అనగా మార్చి 30 వ తేదీన భారీ అంచనాలు నడుమ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాషతో పాటు తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషల్లో కూడా విడుదల అయింది.
 

ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బాస్టర్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు దక్కాయి. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్ లకు సంబంధించి అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 38 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సూపర్ పాజిటివ్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ కి భారీ కలెక్షన్ లు లాంగ్ రన్ లో వచ్చే అవకాశాలు చాలా వరకు కనబడుతున్నాయి. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహించిన ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా ... కీర్తి సురేష్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: