కొత్త స్టైల్ లో "పుష్ప 2" టీజర్..?

Pulgam Srinivas
ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్న మూవీ లలో పుష్ప పార్ట్ 2 మూవీ ఒకటి. ఇప్పటికే పుష్ప పార్ట్ 1 మూవీ భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని అందు కొని భారీ కలెక్షన్ లని బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. అలా పుష్ప మూవీ మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ రెండవ భాగంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నిలకొని ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా సుకుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ నిర్మించిన ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. సమంత ఈ మూవీ లో స్పెషల్ సాంగ్ లో నటించగా ... మలయాళ నటుడు పహాధ్ ఫాజిల్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు.

పుష్ప మొదటి భాగం విడుదల అయ్యి ఇప్పటికే సంవత్సరం దాటిపోతున్న రెండవ పార్ట్ నుండి ఎలాంటి అప్డేట్ లను కూడా చిత్ర బృందం ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప మూవీ రెండవ భాగము నుండి ఏప్రిల్ 8 వ తేదీన అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ టీజర్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ టైటిల్ టీజర్ ను దర్శకుడు సుకుమార్ కొత్త స్టైల్ లో డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ టీజర్ మొత్తం అల్లు అర్జున్ కనిపించబోతున్నట్లు ... అలాగే ఈ టీజర్ చాలా స్టైలిష్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ టీజర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: