అఫీషియల్ : ఎన్బికె108 విడుదలకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన చిత్ర బృందం..!

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ మధ్య కాలంలో వరస విజయాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొంత కాలం క్రితమే అఖండ మూవీ తో అదిరిపోయే భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర బాలయ్య సొంతం చేసుకున్నాడు. ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా నటించగా ... బోయపాటి శ్రీను ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.
 

ఇది ఇలా ఉంటే బాలయ్య ఈ సంవత్సరం వీర సింహా రెడ్డి అనే మరో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా సూపర్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ తన కెరియర్ లో 108 వ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

ఈ సినిమాకు ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ ను ఎన్ బి కె 108 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్ర బృందం ఫుల్ జోష్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి బాలయ్య కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ మూవీ యూనిట్ విడుదల చేయగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదలకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. ఈ సినిమాను ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను ఈ మూవీ యూనిట్ కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: