మీడియం రేంజ్ హీరోలలో ఆ ఏరియాలో నాని "దసరా" మూవీనే టాప్..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాని కెరియర్ ప్రారంభంలో తక్కువ బడ్జెట్ మూవీ లలో నటిస్తూ ఎన్నో విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని అలాగే తన నటన తో ప్రేక్షకులను ఆకట్టుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో గా మారిపోయాడు. ఇలా ఉంటే ఇప్పటికే కెరియర్ లో ఎన్నో అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న నాని తాజాగా దసరా అనే మూవీ లో హీరో గా నటించాడు.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా ... మహానటి కీర్తి సురేష్ ఈ మూవీ లో నాని సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా నిన్న అనగా మార్చి 30 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా నిన్ననే విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు సూపర్ ఓపెనింగ్ లు లభించాయి.

అందులో భాగంగా మరి ముఖ్యంగా ఈ మూవీ కి నైజాం ఏరియాలో సూపర్ సాలిడ్ కలెక్షన్ లు లభించాయి. నైజాం ఏరియాలో ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు 6.78 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. నాని కెరియర్ లోనే నైజాం ఏరియాలో ఇవి టాప్ కలెక్షన్ లు కాగా ... ఇప్పటి వరకు మీడియం రేంజ్ హీరోలలో ఏ హీరో కూడా నైజాం ఏరియాలో ఈ రేంజ్ కలెక్షన్ లను సినిమా విడుదల అయిన మొదటి రోజు అందుకోనట్లు తెలుస్తుంది. దీనితో దసరా మూవీ తో నైజాం ఏరియాలో నాని మీడియం రేంజ్ హీరోలలో టాప్ పొజిషన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: