2023లో నైజాంలో అత్యధిక షేర్ కలెక్షన్లను సాధించిన టాప్ 4 మూవీలు ఇవే..!

Pulgam Srinivas
ఈ సంవత్సరం ఇప్పటికే ఎన్నో సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు విడుదల అయిన మొదటి రోజు నైజాం ఏరియాలో భారీ కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టాయి. అలా ఈ సంవత్సరం విడుదల అయిన సినిమాలలో నైజాం ఏరియాలో మొదటి రోజు అత్యధిక షేర్ కలక్షన్ లను రాబట్టిన టాప్ 4 మూవీ లు ఏవో తెలుసుకుందాం.
దసరా : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నాని హీరోగా రూపొందిన ఈ మూవీ కి కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా ... కీర్తి సురేష్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ నిన్న అనగా మార్చి 30 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు నైజాం ఏరియాలో 6.78 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసి ఈ సంవత్సరం నైజాం ఏరియాలో ఇప్పటి వరకు విడుదల అయిన మూవీ లలో అత్యధిక షేర్ కలెక్షన్ లను వసూలు చేసిన మూవీ లలో టాప్ స్థానంలో నిలిచింది.
వీర సింహా రెడ్డి : బాలకృష్ణ హీరో గా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మొదటి రోజు నైజం ఏరియాలో 6.21 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు వసూలు చేసింది.
వాల్టేర్ వీరయ్య : చిరంజీవి హీరో గా శృతి హాసన్ హీరోయిన్ గా బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మొదటి రోజు నైజాం ఏరియాలో 6.10 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.
వారసుడు : తమిళ హీరో దళపతి విజయ్ హీరోగా రూపొందిన ఈ తమిళ డబ్బింగ్ సినిమా మొదటి రోజు నైజాం ఏరియాలో 1.40 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: