ప్రేక్షకులను వెర్రి వాళ్ళను చేసిన మంచు కుటుంబం..!!

Divya
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసిన వీడియో తెగ వైరల్ గా మారింది.. దీంతో మంచు కుటుంబంలో గడచిన కొద్ది సంవత్సరాల నుంచి విభేదాలు ఉన్నాయని వార్తలు కూడా వినిపించాయి. తాజాగా మంచు విష్ణు ఇది బిగినింగ్ మాత్రమే అంటూ ఒక వీడియోని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది.. ఇండియాలో బిగ్గెస్ట్ రియాలిటీ షో హౌస్ ఆఫ్ మంచు అనే పేరుతో త్వరలోనే ప్రసారమయ్యే రియాల్టీ షో అనే వీడియోతో తెలియజేయడం జరిగింది.

దీంతో ఇది పబ్లిసిటీ కోసమే చేశారన్నట్లుగా తెలిసిపోతుంది. దీంతో పలువురు నేటిజెన్లు ఒక్కసారిగా షాక్  కు గురవుతున్నారు. మోహన్ బాబు కుటుంబంలో తరచూ ఈ మధ్య వార్తలలో నిలుస్తూనే ఉంది. ఆయన రెండో కుమారుడు మనోజ్ ఇటీవలే భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకోవడం జరిగింది.. ఇది జరిగి నెల రోజులైనా గడవకముందే అప్పుడే అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చాయని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

గతంలో తమ దగ్గర పనిచేసిన సారధి అనే వ్యక్తి పై మంచు విష్ణు దాడి చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేయడం జరిగింది మనోజ్.. తండ్రి మోహన్ బాబు కలగజేసుకొని తాత్కాలికంగా గొడవని ఆపిన సమస్య పరిష్కారం కాలేదు అన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇదంతా కేవలం "హౌస్ ఆఫ్ మంచూస్" అనే ఒక రియాలిటీ కోసమే చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా అందుకు సంబంధించి ఒక వీడియో పోస్ట్ షేర్ చేయడం జరిగింది. ఇందులో మంచు కుటుంబానికి సంబంధించి ఒక వీడియో తెగ వైరల్ గా మారుతోంది.. వీడియో విషయానికి వస్తే మొదట పెదరాయుడు ఇంట్లో పంచాయతీ అంటూ వీడియో మొదలవుతుంది.. ఆ తర్వాత మంచు ఇంట్లో వివాదం టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది అంటూ ముందుకు సాగుతుంది. దీంతో ఇదంతా కేవలం ప్రమోషన్స్ కోసమే ఇలా చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి కొంతమంది ప్రేక్షకులను వెర్రి వాళ్ళను చేశారనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: