దసరా: పక్కా పాన్ ఇండియా హిట్.. ఓటిటి పార్ట్‌నర్‌ లాక్ ?

Purushottham Vinay
దసరా: పక్కా పాన్ ఇండియా హిట్.. ఓటిటి పార్ట్‌నర్‌ లాక్ ?

టాలీవుడ్ యంగ్ హీరో నాచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం 'దసరా'.  నేడు భారీ అంచనాల మధ్య చాలా గ్రాండ్ గా విడుదల అయ్యింది. పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన తీరు అయితే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో చాలా బాగా సక్సెస్ అయ్యింది.పొద్దున నుంచి సినిమాపై చాలా మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. మొత్తానికి నాని ఈ సినిమాతో పాన్ ఇండియా హిట్టు కొట్టేశాడు.ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సినిమాలో నాని పర్ఫార్మెన్స్‌కు ఎంతగానో ఫిదా అవుతున్నారు. రిలీజ్ అయిన అన్ని చోట్లా కూడా ఈ సినిమాకు సాలిడ్ రెస్పాన్స్ వస్తుండటంతో దసరా సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని సినీ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇక ఇదిలా ఉండగా, ఈ సినిమా ఓటీటీ పార్ట్‌నర్‌ను కూడా లాక్ చేసుకుంది. 


ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అయిన నెట్‌ఫ్లిక్స్ దసరా చిత్ర డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది.ఇంకా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ను థియేట్రికల్ రన్ ముగిసిన తరువాత చేయనుంది. ఇక ఈ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ చిత్ర నిర్మాతలకు చాలా భారీ మొత్తాన్ని ఇచ్చినట్లుగా సమాచారం తెలుస్తోంది. నాని పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్, కీర్తి సురేష్ యాక్టింగ్ ఇంకా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వ ప్రతిభ కలగలిసి ఈ సినిమాను పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా నిలబెట్టినట్లుగా చూసిన జనాలు అంటున్నారు.ఇక ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. అతని సంగీతం ఈ సినిమాకి మేజర్ అసెట్‌గా నిలిచింది. ఈ మూవీ సాంగ్స్ కూడా యూ ట్యూబ్ లో ఇప్పటికే చార్ట్‌బస్టర్స్‌లో టాప్ ప్లేస్‌లో దూసుకెళ్తున్నాయి. మరి దసరా సినిమాని నెట్‌ఫ్లిక్స్ ఎప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తుందో చూడాలి.ఈ సినిమా హిట్టుతో నాని కూడా పాన్ ఇండియా హీరోల జాబితాలో చేరిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: