దసరాలో సిల్క్ స్మిత ఎలా వచ్చింది అంటే..!

shami
నాని దసరా సినిమా థియేటర్ లోకి వచ్చేసింది. గత కొంతకాలంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో నాని ఫుల్ బిజీగా మారగా సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్ చూసి నాని ఖుషి అయ్యారు. ముఖ్యంగా ధరణి పాత్రలో నానిని చూపించిన నటన అదుర్స్ అంటున్నారు. ఇన్నాళ్లు నానిని కేవలం ఒక యాంగిల్ లో మాత్రమే చూశాం కానీ నానిలో చాలా విషయం ఉంది అనిపించేలా చేశాడని చెప్పుకుంటున్నారు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కూడా సినిమాను అనుకున్న రేంజ్ లో తెరకెక్కించడం లో సక్సెస్ అయినట్టు తెలుస్తుంది.
అయితే ఈ సినిమా మొదటి నుంచి సిల్క్ స్మిత పోస్టర్ హైలెట్ అవుతూ వచ్చింది. సినిమా లో సిల్క్ బార్ దగ్గరే కథ నడుస్తుంది. పార్టీలు గట్రా అక్కడే చేసుకుంటారు. అసలు ఈ సినిమా కు సిల్క్ స్మితకు సంబంధం ఏంటి అని డైరెక్టర్ ని అడిగితే ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. చిన్నప్పుడు తన తాత సింగరేణి లో పంచేస్తుంటే కాలు విరిగిందట ఆయన కోసం కల్లు దుకాణంలో కల్లు తీసుకొచ్చేందుకు వెళ్తే అక్కడ సిల్క్ స్మిత పోస్టర్స్ ఉన్నాయట. ఆ పోస్టర్స్ చూసి తనకు ఇక్కడ వాటిని వాడేయాలని అనుకున్నాడత శ్రీకాంత్.
ఇప్పట్లో స్పెషల్ సాంగ్స్ కి హీరోయిన్స్ కూడా ఓకే అంటున్నారు కానీ అప్పట్లో సిల్క్ స్మిత వన్ అండ్ ఓన్లీ ఫర్ స్పెషల్ సాంగ్ అనిపించింది. ఆమె ఒక్కసారి బావలు అంటే ఆడియన్స్ అంతా సై సై అనేవారు. సో అలా డైరెక్టర్ కి చిన్నప్పటి ఆ రిఫరెన్స్ ఇప్పుడు ఈ సినిమాలో బాగా వాడుకునేలా చేసింది. ఏది ఏమైనా అంత లోతుగా ఆలోచించిన మనిషి కాబట్టే దసరానిని నిలబెట్టేలా చేశాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. సినిమా చూసిన నాని ఫ్యాన్స్ అండ్ జెనరల్ ఆడియన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: