దసరా పండగ సందర్భంగా ఈ సంవత్సరం విడుదల కానున్న సినిమాలు ఇవే..!

Pulgam Srinivas
ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల కానున్న సినిమాలు ఏవో తెలుసుకుందాం. తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి లోకేష్ కనకరాజు ప్రస్తుతం లియో అనే మూవీ ని తెరకెక్కిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో తలపతి విజయ్ హీరో గా నటిస్తూ ఉండగా ... త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఉస్తాద్ రామ్ పోతినేని ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గ నటిస్తూ ఉండగా ... సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని అక్టోబర్ 20 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న టైగర్ నాగేశ్వరరావు మూవీ ని అక్టోబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడు గా మంచి గుర్తింపును తెచ్చుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా ఒక మూవీ ని తెరకెక్కిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని కూడా ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీని చిత్ర బృందం ఇప్పటివరకు ప్రకటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: