RRR: ప్రియాంక చోప్రాపై మండిపడుతున్న నెటిజన్స్?

Purushottham Vinay
ప్రపంచవేదికపై సత్తా చాటిన ఇండియన్ తెలుగు  సినిమా RRR.ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఇంకా నటీనటులు ఎప్పటికీ కళగా మిగిలిపోతుందనుకున్న ఆస్కార్ అవార్డును కైవసం చేసుకుని చరిత్ర సృష్టించి భారత దేశం మీసం తిప్పింది ఆర్.ఆర్.ఆర్ సినిమా.ఇంటర్నేషనల్ లెవెల్ లో చాలా అవార్డ్స్ అందుకుని తెలుగు స్థాయిని ఎంతగానో పెంచింది.టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ సృష్టించింది.  రూ. 1250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రీసెంట్ గా జరిగిన 95వ అకాడమీ అవార్డ్స్ వేడుకలలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆర్.ఆర్.ఆర్ టీమ్ పై ప్రశంసలు కురిపించారు హాలీవుడ్ మేకర్స్. అయితే ఈ మూవీ తమిళ్ మూవీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. రీసెంట్ గా అమెరికన్ పోడ్ కాస్ట్ హోస్ట్ డాక్స్ షెపర్డ్‏కు ఇంటర్వ్యూ ఇచ్చింది ప్రియాంక చోప్రా.ఇందులో భాగంగా హోస్ట్ ఆర్ఆర్ఆర్ సినిమాను బాలీవుడ్ మూవీ అని పిలవగా.. కాదు అది తమిళ్ మూవీ అని సమాధానమిచ్చింది. దీంతో ప్రియాంక కామెంట్స్ పై మండిపడుతున్నారు తెలుగు నెటిజన్స్.


నిజానికి ఆస్కార్ వేడుకలలో రాజమౌళి .. కీరవాణి.. రామ్ చరణ్ ఉపాసన దంపతులతో కలిసి ఫోటోస్ దిగింది ప్రియాంక చోప్రా. ఈ క్రమంలోనే  ఈ ఇంటర్య్వూలో ప్రియాంక మాట్లాడుతూ.. బాలీవుడ్ ఇండస్ట్రీలో గొడ్డు మాంసం గురించి ఆమె మాట్లాడింది. ఇంకా అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు వ్యక్తులు స్టూడియోస్ అన్నింటిని నియంత్రిస్తున్నారని కూడా తెలిపింది. ఐదారుగు నటీనటులు పెద్ద పెద్ద సినిమాలు చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా మారింది.. అన్నింటిలో ఫస్ట్ ది ఓటిటి స్ట్రీమింగ్. ఇది కంటెంట్ అందించేవారికి లైఫ్ ఇచ్చింది. బాలీవుడ్ ఇండస్ట్రీ అనేది చాలా అభివృద్ధి చెందింది. అలాగే అక్కడ యాక్షన్ నుంచి లవ్ స్టోరీ .. డ్యాన్స్ అన్ని రకాల సినిమాలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది.ఇక ఈ క్రమంలోనే హోస్ట్ బాలీవుడ్ మూవీ ఆర్ఆర్ఆర్ అనగా.. వెంటనే ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. 'అది అది పెద్ద బ్లాక్ బస్టర్ తమిళ్ మూవీ. అంటే మనకు అవెంజర్స్ మూవీ లాంటింది' అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ప్రియాంక మాటలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలుగు నెటిజన్స్.ఈ నార్త్ ఇండియన్స్ ఎప్పుడూ తెలుసుకుంటారు.. అసలు సౌత్ ఇండియాలో మొత్తం 5 రాష్ట్రాలు 5 భాషలు ఉన్నాయని.. అందులో తెలుగు కూడా ఉందని అంటూ ప్రియాంకని ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: