నేను ఆ హీరోకు పెద్ద అభిమానిని ... శ్రీ లీల..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ సినిమా అవకాశాలను దక్కించు కుంటూ ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి మానులలో ఒకరు అయినటువంటి శ్రీ లీల గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది . ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయం అందుకుంది. కాకపోతే ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ తన అద్భుతమైన డాన్స్ తో అంతకు మించిన అంద చందాలతో ప్రేక్షకులను కట్టి పడేసింది .

దానితో ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస సినిమా అవకాశాలను దక్కించు కుంటూ ముందుకు దూసుకు పోతుంది . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ మహేష్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ లో నటిస్తోంది. అలాగే బాలకృష్ణ హీరో గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది.

వీటితో పాటు మరెన్నో క్రేజీ మూవీ లలో కూడా ఈ ముద్దు గుమ్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇలా వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్న ఈ ముద్దు గుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా శ్రీ లీల తన అభిమాన హీరో ఎవరు అనేది చెప్పుకొచ్చింది. తాజాగా శ్రీ లీల ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ... నేను నందమూరి నట సింహం బాలకృష్ణ కు వీరాభిమానిని అంటూ చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: