ఈరోజు ఆ సమయానికి "పొన్నియన్ సెల్వన్ 2" ట్రైలర్ విడుదల..!

Pulgam Srinivas
గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం ఇప్పటికే తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన మూవీ లకు దర్శకత్వం వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పోనియన్ సెల్వఅన్ మూవీ భారీ అంచనాల నడుమ తమిళ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

అందులో మొదటి భాగం ఇప్పటికే విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది. ఈ మొదటి భాగంలో విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష ముఖ్య పాత్రలలో నటించగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ కి సంబంధించిన రెండవ భాగం షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇప్పటికే ఈ మూవీ ని ఈ సంవత్సరం ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్ లను మొదలు పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ ట్రైలర్ ను ఈ రోజు రాత్రి 9 గంటల 30 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ లో ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్న నటీనటులు ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: