విశ్వక్ సేన్ నెక్స్ట్ బిగ్ డీల్..!

shami
యువ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో అదరగొట్టేస్తున్నాడు. ప్రస్తుతం యంగ్ హీరోల్లో కెరీర్ ఫుల్ స్వింగ్ మీద ఉన్న హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు. రీసెంట్ గా దాస్ కా ధంకీ అంటూ వచ్చి ప్రేక్షకులను అలరించిన విశ్వక్ సేన్ తన తన నెక్స్ట్ సినిమా ఎనౌన్స్ మెంట్ తో సర్ ప్రైజ్ చేశాడు. ఈసారి విశ్వక్ సేన్ సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో సినిమా చేస్తున్నాడు. స్టార్ హీరోలతో హారిక హాసిని, యువ హీరోలతో సితార బ్యానర్ చేస్తున్న సినిమాలు మంచి ఫలితాలు అందిస్తున్నాయి.
ఈ క్రమంలో విశ్వక్ సేన్ తో సితార ఎంటర్టైన్ మెంట్స్ క్రేజీ మూవీ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాకు లిరిసిస్ట్ కృష్ణ చైతన్య డైరెక్షన్ చేస్తున్నారు. గేయ రచయితగా చేస్తూ సినిమాలను డైరెక్ట్ చేస్తున్నారు కృష్ణ చైతన్య. రౌడీ ఫెల్లో సినిమా తర్వాత నితిన్ తో ఛల్ మోహన్ రంగ సినిమా చేసిన కృష్ణ చైతన్య శర్వానంద్ తో 33వ సినిమా అనుకున్నా అది ఎందుకో సెట్స్ మీదకు వెళ్లలేదు. ప్రస్తుతం విశ్వక్ సేన్ తో కృష్ణ చైతన్య సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.
ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ తో రిలీజ్ చేసిన వీడియో క్రేజీగా ఉంది. యువ హీరోల్లో సినిమా సినిమాకు కొత్తగా కనిపిస్తున్న విశ్వక్ సేన్ ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటుతాడని చెప్పొచ్చు. విశ్వక్ సేన్ సినిమా అంటే సంథింగ్ స్పెషల్ అనేలా చేసుకున్నాడు. మరి విశ్వక్ సేన్ తో సితార ఎలాంటి సినిమా చేస్తుందో చూడాలి. ఈ సినిమాకు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ అదే త్రివిక్రం గారి వైఫ్ సౌజన్య కూడా భాగం అవుతున్నారు. సో త్రివిక్రం హ్యాండ్ ఉంది అంటే సినిమా నెక్స్ట్ లెవల్ అన్నట్టే. విశ్వక్ సేన్ కెరీర్ లో ఈ సినిమా తప్పకుండా సెపరేట్ గా ఉంటుందని చెప్పొచ్చు. మరి సినిమా కథ ఏంటి.. టైటిల్ ఏంటి మిగతా స్టార్ కాస్ట్ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: