బలగం వేణుకి బంపర్ ఆఫర్..!

shami
జబర్దస్త్ లో కమెడియన్ గా చేస్తూ వచ్చిన వేణు ఆ తర్వాత ఆ షో మానేసి రీసెంట్ గా కామెడీ స్టాక్ ఎక్సేంజ్ లో కనిపించాడు. అనీల్ రావిపుడి జడ్జ్ గా చేస్తున్న ఆ షోలో ఎప్పటిలానే తన పంచులతో అలరిస్తున్నాడు వేణు. అయితే అతని డైరెక్షన్ లో దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి సినిమా అనగానే ఏదో ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నారని అనుకున్నారు కానీ ఆ సినిమా ఇంప్యాక్ట్ ఇంతగా ఉంటుందని ఎవరు ఊహించలేదు. బలగం తెలంగాణా పల్లె కథగా మొదలై ఇప్పుడు ప్రతి తెలుగు ప్రేక్షకుడి హృదయాన్ని బరువెక్కేలా చేస్తుంది.
సినిమా థియేటర్ లో సక్సెస్ ఫుల్ రన్ అవుతుండగా ఓటీటీ రిలీజ్ కాగా అక్కడ కూడా సూపర్ హిట్ అనిపించుకుంది. బలగం లాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావు అని ఆడియన్స్ సోషల్ మీడియాలో డిస్కషన్ చేస్తున్నారంటే వేణు ఎల్దండి కి ఇంతకన్నా ఏం కావాలి. మొదటి సినిమా కమర్షియల్ గా సక్సెస్ కొట్టొచ్చు కానీ అందరికి గుర్తుండిపోయే సినిమా తీయడం కొందరికే సాధ్యం అది వేణు వల్ల అయ్యింది. ఇక ఇంత గొప్ప సక్సెస్ ఇచ్చినందుకు దిల్ రాజు ఫుల్ ఖుషీగా ఉన్నారట.
అంతేకాదు తన నెక్స్ట్ సినిమాకు దిల్ రాజు ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. నువ్వు అడిగిన హీరో డేట్స్ ఇస్తా నువ్వు కోరిన బడ్జెట్ ఇస్తా ఏ సినిమా చేస్తావో చెయ్యి అన్నట్టుగా అన్నారట. అయితే మొదటి సినిమా 3 నుంచి 5 కోట్ల లోపే పూర్తి చేసిన వేణు ఈసారి కొద్దిగా ఎక్కువ బడ్జెట్ తో సినిమా చేయాలని చూస్తున్నారట. దిల్ రాజు ఎలాగు అభయం ఇచ్చాడు కాబట్టి ఇక అతనికి తిరుగు ఉండదని చెప్పొచ్చు. జబర్దస్త్ వేణు డైరెక్టర్ గా సూపర్ సక్సెస్ అవడం అందరిని సర్ ప్రైజ్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: