డేటింగ్లో వున్నా..ఆ విషయంలో తగ్గేదేలే: మాధవిలత

Purushottham Vinay
టాలీవుడ్  హీరోయిన్ మాధవి లత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అచ్చమైన తెలుగుమ్మాయి మాధవి లత. నచ్చావులే, స్నేహితుడా వంటి సినిమాలతో యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తరువాత అవకాశాలు రాక వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. సూపర్ స్టార్ మహేష్ బాబు అతిధి సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసిన ఈమె ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా డైరెక్టర్ సురేందర్ రెడ్డితో తనకు జరిగిన చేదు అనుభవం గురించి వైరల్ కామెంట్స్ చేసింది. అలా ఈమె పేరు ఒక సందర్భంలో బాగా మారు మొగిపోయింది.హీరోయిన్ గా అవకాశాలు రాక బీజేపీ పార్టీలో చేరి సినిమాలకు ఇంకా నటనకు పూర్తిగా దూరంగా ఉంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తుంది.


ఇక తాజాగా ఈ మాజీ తెలుగు హీరోయిన్ మాధవి లత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేసి తన ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. '' నేను ఒక వ్యక్తిని కలిశా ముందు అతడిని బాగా అర్థం చేసుకోవాలి.ఇక ఆ తర్వాత రెండువైపులా పెద్దల అనుమతి పొందాలి. అయితే ఇది అంత త్వరగా జరిగే పని కాదు. మరో సంవత్సరం సమయం పట్టొచ్చు. అతడిని పెళ్లి చేసుకుంటానో లేదో మీకు ఖచ్చితంగా తప్పకుండా చెప్తాను.అయితే పెళ్లి తేదీ గురించి మాత్రం నన్ను అడగొద్దు. అసలు అతను తెలుగు వ్యక్తి అయితే మాత్రం కాదు. నన్ను పెళ్లి గురించి అడిగి మీరు డిస్టబ్ చేయొద్దు. నేను నా నమ్మకాలను గౌరవించే వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకుంటా. ఈ విషయంలో మాత్రం అసలు తగ్గేదెలా'' అంటూ ఈమె చెప్పుకొచ్చింది. దీంతో మాధవిలత ఓ వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నట్లు నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం మాధవిలత డేటింగ్ టాపిక్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: