అఫీషియల్ : మహేష్ 28వ మూవీ నెక్స్ట్ అప్డేట్ అప్పుడే... నాగ వంశీ..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీయర్ లో 28 వ మూవీ గా రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే ... శ్రీ లీల ... మహేష్ సరసన హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... టాలెంటెడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారు ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... జయరామ్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితమే వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఈ సినిమా నుండి మహేష్ కు సంబంధించిన ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ ను ఈ మూవీ ప్రొడ్యూసర్ అయినటు వంటి సూర్య దేవర నాగు వంశీ అధికారికంగా ప్రకటించాడు.

తాజాగా ఈ మూవీ ప్రొడ్యూసర్ సూర్య దేవర నాగ వంశీ సోషల్ మీడియా వేదికగా మహేష్ ... త్రివిక్రమ్ కాంబినేషన్ లో పొందుతున్న మూవీ గురించి స్పందిస్తూ ... "ఎస్ ఎస్ ఎం బి 28" మూవీ నుండి నెక్స్ట్ అప్ డేట్ ని సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి రోజున రిలీజ్ చేస్తాం అని ఈ మూవీ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ తాజాగా సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు. ఇది ఎలా ఉంటే మహేష్ ... త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూడవ మూవీ కావడంతో ప్రేక్షకుల్లో ఈ మూవీ పై భారీగా అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: