రీ రిలీజ్ లో అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాలు ఇవే..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ సినిమాల హవా బాగా పెరిగిపోతుంది.. వరుస పెట్టి స్టార్ హీరోల చిత్రాలను పుట్టినరోజులకు ఏదైనా స్పెషల్ డేస్ లకు సంబంధించి పలు రకాల సినిమాలను విడుదల చేస్తూ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నారు. అయితే రీ రిలీజ్ సినిమాలలో ఏది ఎక్కువగా కలెక్షన్లు సాధించింది అనే విషయం ఇప్పటివరకు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే అలా వచ్చిన డబ్బులను కొంతమంది పలు రకాల సేవ కార్యక్రమాలకు కూడా వినియోగిస్తూ ఉంటే కొంతమంది మాత్రం డబ్బులను క్యాష్ చేసుకుంటున్నారు.

ఇప్పటివరకు విడుదలైన చిత్రాలలో పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి చిత్రం రూ.1.65 కోట్ల రూపాయల కలెక్షన్లను నైజాం ఏరియాలో సంపాదించింది. ఈ చిత్రమే మొదటి స్థానంలో ఉన్నది. ఇక తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమా రూ.1.26 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది.. ఆ తర్వాత లిస్టులో మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా.. రూ.90 లక్షలు రాబట్టింది. ఇక రాంచరణ్ నటించిన ఆరంజ్ చిత్రం నిన్నటి రోజున విడుదల చేయగా రూ.75 లక్షల రూపాయలను రాబట్టింది. అలాగే మహేష్ నటించిన పోకిరి సినిమా రూ.69 లక్షల రూపాయలను రాబట్టింది ఇదంతా కేవలం నైజాం ఏరియాలోని రాబట్టినట్లు తెలుస్తోంది

ఇక ఇవే కాకుండా చాలామంది హీరోలు సైతం రీ రిలీజ్ సినిమాలను విడుదల చేయడం జరిగింది కానీ అవన్నీ ఏవి పెద్దగా సక్సెస్ కాలేకపోయినట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ రిలీజ్ రెండు హవ్వ భారిగానే కొనసాగేలా కనిపిస్తోంది. ప్రస్తుతం స్టార్ హీరోలంతా తమ తమ చిత్రాల షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా అందరూ పాన్ ఇండియా చిత్రాలను విడుదల చేస్తూ ఉండడం గమనార్హం. రాబోయే రోజుల్లో రీ  రిలీజ్ ట్రెండింగ్ హవాలా ఏ సినిమా మారుస్తాయో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: