గేమ్ చేంజర్: మళ్ళీ అడ్డంగా దొరికిన తమన్ బాబు?

Purushottham Vinay
ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో ఎక్కువ సినిమాలతో దూసుకుపోతూ ఫుల్ బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ లలో టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ముందు వరుసలో ఉంటాడనే చెప్పాలి. వరుస సినిమాలతో చాలా బిజీగా వున్నాడు. పైగా చేసేవన్నీ కూడా పెద్ద పెద్ద స్టార్ సినిమాలే. ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు సౌత్ లో కూడా మోస్ట్ బిజీఎస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు థమన్.మరీ ముఖ్యంగా తెలుగు దర్శక నిర్మాతలకు  అయితే తమన్ ఏకైక ఆప్షన్ గా మారిపోయాడనే చెప్పాలి.ఒకప్పుడు ఫుల్ బిజీగా ఉన్న దేవిశ్రీప్రసాద్ ఇప్పుడు ఫామ్ ని కోల్పోయాడు. అతని సంగీతం ఇప్పుడు ఆకట్టుకోలేకపోవడం వల్ల తమన్ కి బాగా కలిసి వస్తుంది.పైగా ఇతడు చేస్తున్న అన్ని సినిమాల్లో పాటలు కూడా బాగా చాట్ బస్టర్స్ గా నిలుస్తూ ఉండడంతో ఎక్కువగా తమన్ మీద ఆసక్తి చూపిస్తున్నారు మూవీ మేకర్స్. అయితే తమన్ ఒకపక్క బిజీగా ఉంటూనే మరోపక్క కాపీ ట్యూన్స్ అందిస్తున్నాడని కాపీ మరకలతో చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నాడు.


ఇప్పటికే చాలా ట్యూన్స్ విషయంలో అడ్డంగా దొరికిపోయిన తమన్ ఇప్పుడు రామ్ చరణ్ 15వ సినిమా గేమ్ చేంజెర్ టైటిల్ రివీల్ పోస్టర్ వీడియో కోసం చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా చాలా ఈజీగా వెంటనే అడ్డంగా దొరికిపోయాడు. ఒకప్పుడు సోషల్ మీడియా అంతగా అందుబాటులో లేని సమయంలో ఇలాంటి విషయాలు పెద్దగా బయటకి వచ్చేవి కావు. ఒకవేళ వచ్చినా ఆడియన్స్ వీటిని సీరియస్ గా తీసుకునేవారు కాదు. కానీ ఇప్పుడు ఎక్కడ నుంచి కాపీ ట్యూన్ తెచ్చారు అనే విషయాన్ని కూడా బట్టబయలు చేస్తూ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు.తాజాగా ఇదే విషయాన్ని వెల్లడిస్తూ కొంతమంది తమన్ ట్యూన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో అనే వీడియోని కూడా బయట పెట్టారు. 2010 వ సంవత్సరంలో బాలీవుడ్ లో రూపొందిన ఐషా అనే మూవీ నుంచి సాక్ష్యం తీసుకొచ్చారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో అభయ్ డియోల్, సోనం కపూర్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఒక పెళ్లి సందర్భంగా కుటుంబం అంతా కలిసి డాన్స్ చేస్తున్నప్పుడు ఈ సాంగ్ వస్తుంది.అమిత్ త్రివేది సంగీతం అందించినం గల్ మిట్టి మిట్టీ సాంగ్ ట్యూన్ ని యాజ్ ఇట్ ఈజ్ గా ఈ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి వాడేశాడు మన తమన్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: