RRR: జపాన్లో తగ్గని క్రేజ్.. అదీ తెలుగోడి పవరంటే?

frame RRR: జపాన్లో తగ్గని క్రేజ్.. అదీ తెలుగోడి పవరంటే?

Purushottham Vinay
తెలుగోడి సత్తాను ఇంకా తెలుగు సినిమా పవర్ ని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా ఆర్ఆర్ఆర్.టాలీవుడ్ టాప్ డైరెక్టర్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా వరల్డ్ బాక్సాఫీస్‌ను తన వసూళ్లతో ఎంతగానో షేక్ చేసింది. విదేశాల్లో కూడా ఈ సినిమా రికార్డ్‌ స్థాయిలో వసూళ్లు రాబట్టింది.ముఖ్యంగా జపాన్‌ దేశంలో ఆర్ఆర్ఆర్ క్రేజ్‌ అసలు మామూలుగా లేదు. దేశవ్యాప్తంగా రికార్డ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా జపాన్‌ దేశంలో కూడా సూపర్ గా అదరగొట్టిన సంగతి తెలిసిందే. అక్కడి అభిమానులను ఆర్ఆర్ఆర్ సినిమా చాలా విపరీతంగా ఆకట్టుకుంది. అక్టోబర్ 21 వ తేదీన జపాన్‌ దేశంలో విడుదలై 'ఆర్ఆర్ఆర్' సినిమా రికార్డులు సృష్టించింది. 24ఏళ్ల క్రితం జపాన్‌ దేశంలో రిలీజ్‌ అయిన సూపర్ స్టార్ రజనీకాంత్‌  'ముత్తు' సినిమా రికార్డ్ వసూళ్లను ఆర్.ఆర్.ఆర్ సినిమా బద్దలు కొట్టింది.


అలాగే అమెరికాలోని లాస్‌ ఎంజిల్స్‌లో జరిగిన ఆస్కార్ వేడుకల్లో నాటు నాటు పాటకు ఇంటర్నేషనల్ టాప్ అవార్డ్ అయిన ఆస్కార్ అవార్డ్ దక్కింది.అయితే తాజాగా జపాన్‌ దేశంలో ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ అసలు ఏ మాత్రం తగ్గడం లేదు. జపాన్‌లో ఓ అభిమాని తన కుమారుని కోసం అదిరిపోయే గిఫ్ట్ ని ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమాని తన బిడ్డకి అర్థమయ్యేలా ఓ తల్లి ఏకంగా ఈ సినిమా బొమ్మలతో కూడిన స్టోరీ బుక్‌ను తయారు చేసింది. కామిక్ బొమ్మల రూపంలో తయారు చేసిన ఆ బుక్ సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరలవుతోంది. దీన్ని బట్టి చూస్తుంటే ఇండియాలోనే కాదు.. విదేశాల్లో కూడా ఆర్ఆర్ఆర్‌ సినిమాకు ఎంత క్రేజ్ ఉందో పూర్తిగా అర్థమవుతోంది.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1250 కోట్ల దాకా వసూళ్ళని సాధించి అల్ టైం ఇండియన్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: