చిరంజీవి "భోళా శంకర్" మూవీ నుండి యాక్షన్ అప్డేట్ ఇచ్చిన మూవీ యూనిట్..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ లో కీర్తి సురేష్ చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటిస్తూ ఉండగా ... మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఇది వరకే చిరంజీవి ... తమన్నా కలిసి సైరా నరసింహా రెడ్డి అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో నటించారు.

 ఈ మూవీ లో వీరిద్దరి నటనకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. మరో సారి వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై మంచి అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ లో కీలకంగా వచ్చే పాటల చిత్రీకరణను ఈ మూవీ బృందం పూర్తి చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్డేట్ ను ప్రకటించింది.

 తాజాగా ఈ మూవీ యూనిట్ సోషల్ మీడియా వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నామని ..
 అలాగే ఈ యాక్షన్ సీక్వెన్స్ ని ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ సారథ్యంలో ప్లాన్ చేస్తున్నట్టుగా ఈ చిత్ర బృందం తెలిపింది. మరి దీనిపై భోళా శంకర్ మూవీ దర్శకుడు మెహర్ మరియు ఫైట్ మాస్టర్స్ పై ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇది  ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ని ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. వాల్టేర్ వీరయ్య మూవీ తర్వాత చిరంజీవి నుండి రాబోతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు కూడా భారీగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: