ఎన్టీఆర్ కొత్త మూవీకి ఇంకా విలన్ కర్ఫర్మ్ కాలేదా..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పోయిన సంవత్సరం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తో గ్లోబల్ గా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇలా ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న ఎన్టీఆర్ మరి కొన్ని రోజుల్లో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో నటించబోతున్నాడు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లో 30 మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ సినిమాను ఎన్టీఆర్ 30 అనే టైటిల్ తో ఈ మూవీ బృందం అనౌన్స్ చేసింది.

కొన్ని రోజుల క్రితం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అధికారికంగా లాంచింగ్ అయింది. రత్నవేలు సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనుండగా ... బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించబోతోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ లో అదిరిపోయే యాక్షన్స్ సన్నివేషాలు ఉండడంతో ఈ మూవీ యొక్క యాక్షన్స్ సన్నివేశాలను హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లతో కొరియోగ్రఫీ చేయించనున్నారు.

అలాగే ఈ మూవీ లో పవర్ఫుల్ విలన్ పాత్ర కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ లో విలన్ పాత్ర కోసం సంజయ్ దత్ ను తీసుకున్నట్లు మొదట వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ ను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం చూసినట్లయితే ఇప్పటి వరకు ఈ చిత్ర బృందం ఈ మూవీ కి విలన్ కన్ఫర్మ్ చేయనట్లు తెలుస్తుంది. ఈ మూవీ లో విలన్ గా చిత్ర బృందం ఎవరిని కన్ఫామ్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: