ఆంధ్ర ప్రదేశ్ ను మ్యూజిక్ ల్యాండ్ గా భావిస్తున్నాను ... తమన్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ లలో ఒకరు అయిన తమన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తమన్ ఎన్నో మూవీ లకు సంగీతాన్ని అందించి ఎన్నో మూవీ ల విజయంలో కీలక పాత్రను పోషించాడు. ఇది ఇలా ఉంటే తమన్ కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాలకు కూడా సంగీతాన్ని అందించాడు.

 ఇది ఇలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న ఈ మ్యూజిక్ డైరెక్టర్ ప్రస్తుతం అనేక మూవీ లకు సంగీతం అందిస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం ఈ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది.

ఈ మూవీ తో పాటు నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ కి కూడా సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందుతుంది. ఈ మూవీ లతో పాటు మరి కొన్ని క్రేజీ మూవీ లకు కూడా తమన్ ప్రస్తుతం సంగీతం అందిస్తున్నాడు. ఇలా ఫుల్ జోష్ లో కెరియర్ ముందుకు సాగిస్తున్న తమన్ తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ లో రికార్డింగ్ స్టూడియో నిర్మిస్తానని ప్రకటించాడు. తాజాగా "ఏయూ" లో కొత్తగా నిర్మించిన ఆడియో రికార్డింగ్ స్టూడియో ను ప్రారంభించిన తమన్ ... నా విశ్రాంత జీవితాన్ని విశాఖ నగరంలో గడిపేందుకు ఎంతో ఇష్టపడుతున్నాను అని చెప్పుకొచ్చాడు. అలాగే ఏపీని మ్యూజిక్ ల్యాండ్ గా భావిస్తున్నాను అని తాజాగా తమన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: