ఆ మూవీలో నటిస్తున్నందుకు నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను ... జాన్వి కపూర్..!

Pulgam Srinivas
బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులలో ఒకరు అయినటువంటి జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో హిందీ మూవీ లలో నటించి అద్భుతమైన గుర్తింపును ఇండియా వ్యాప్తంగా సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో హిందీ మూవీ లలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న ఎన్టీఆర్ 30 వ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ కి సంబంధించిన లాంచింగ్ కార్యక్రమం చాలా భారీ ఎత్తున జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనున్న జాన్వీ కపూర్ కూడా విచ్చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనుండగా ... రత్నవేలు సినిమాటో గ్రాఫర్ వర్క్ చేయనున్నాడు. అలాగే ఈ మూవీ కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ లు పనిచేయనున్నారు.

ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 7 వ తేదీ నుండి ప్రారంభం కాబోతోంది. ఈ మూవీ పై ఎన్టీఆర్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ 30 వ మూవీ లో హీరోయిన్ గా అవకాశం రావడం పై జాన్వి కపూర్ స్పందిస్తూ ... తన అభిమాన హీరో అయిన ఎన్టీఆర్ తో కలిసి చేస్తున్న సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తుండడం చాలా ఆనందంగా ఉంది అని జాన్వి చెప్పుకొచ్చింది. ఇక ఈ మూవీ లో ఛాన్స్ రాగానే తన సంతోషానికి హద్దులు లేవని చెప్పుకొచ్చింది. ఇక ఎప్పుడెప్పుడ అని ఎదురుచూస్తున్న మూవీ షూటింగ్ మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ అవుతూ ఉండడంతో నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను అని జాన్వి చెప్పుకొచ్చింది.
మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: