అఫీషియల్ : ఆర్సి 15 టైటిల్ ను ప్రకటించిన చిత్ర బృందం..!

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించి అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అలాగే ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని కూడా సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. కియార అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శ్రీకాంత్ , సునీల్ , అంజలి ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.

తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో 15 వ మూవీ గా రూపొందుతోంది. ఇది ఇలా ఉంటే ఇన్ని రోజుల పాటు ఈ సినిమాకు చిత్ర బృందం టైటిల్ ను ప్రకటించలేదు. దానితో ఈ మూవీ షూటింగ్ ను ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో చిత్ర బృందం పూర్తి చేస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ రోజు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర బృందం ఈ సినిమా టైటిల్ ను విడుదల చేసింది. ఈ మూవీ కి చిత్ర బృందం "గేమ్ చెంజర్" అనే టైటిల్ ను కన్ఫామ్ చేస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

రామ్ చరణ్ ... శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ కి ఇలా అదిరిపోయే రేంజ్ టైటిల్ ను పెట్టడంతో ఈ మూవీ పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అలాగే ఈ మూవీ యూనిట్ తాజాగా ప్రకటించిన ఈ మూవీ టైటిల్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: