ఈసారి రజనీకాంత్ చిరంజీవి పోటీ తప్పదా..?

Divya
రజనీకాంత్ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారు. ఎలాగైనా ఈసారి సక్సెస్ కొట్టాలని యాక్షన్ కామెడీ సినిమా నేపథ్యంలో తెరకెక్కిస్తున్న జైలర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ కూడా బాగానే ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సంగీతాన్ని అనిరుద్ అందిస్తూ ఉన్నారు. ఇక ఇందులో హీరోయిన్గా తమన్నా నటిస్తున్నట్లు తెలుస్తోంది అలాగే కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ, మోహన్ లాల్ ,శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్ట్ 11న తేదీన విడుదల కాబోతున్నట్లు సమాచారం. మరి ఎంతో భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న జైలర్ సినిమా అభిమానులను మెప్పిస్తుందేమో చూడాలి మరి.

ఇక అలాగే చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ చిత్రం తమిళంలో విడుదలైన వేదాలం సినిమాకు రీమేక్కుగా తెరకెక్కిస్తూ ఉన్నారు ఈ చిత్రం చిరంజీవి 154 వ సినిమాగా తెరకెక్కించడం జరుగుతోంది. ఇందులో హీరోయిన్ గా తమన్నా నటిస్తున్నది.. చిరంజీవి చెల్లెలి పాత్రలో హీరోయిన్ కీర్తి సురేష్ నటించినది. ఇక చిరంజీవి నటించిన గత చిత్రాలను కూడా చిరంజీవి ప్రయోజనం పెంచాయి.

ఇక రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రం చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రాలు ఆగస్టు నెలలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈసారి కచ్చితంగా చిరంజీవి, రజనీకాంత్ మధ్య గట్టి పోటీ ఉంటుందని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి స్టార్ హీరోల సినిమాలు కనుక రిలీజ్ సమయంలో అడ్జస్ట్ చేసుకుని విడుదల చేస్తారా లేకపోతే ఒకే డేట్ కి విడుదల చేస్తారా అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఏది ఏమైనా ఈ ఏడాది స్టార్ హీరోల సినిమాల హవా బాగానే కొనసాగుతోందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: