ఈ ఏడాది ప్రభాస్ రికార్డులు మాములుగా ఉండవు?

Purushottham Vinay
పాన్ ఇండియా సూపర్ స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా 'సలార్'. ఇక ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యేలా చేసింది. ఈ సినిమాను కన్నడ టాప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు కూడా ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఊరమాస్ లుక్ లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని ఆయన ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఆసక్తిగా చూస్తున్నారు.అలాగే ప్రభుస్ చిన్న దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో  ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. హార్రర్ కామెడీ సినిమాగా రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దుతున్నాడట మారుతి. 


ఇక ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ఏకంగా ముగ్గురు భామలు హీరోయిన్లుగా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.అలాగే ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ ఇంకా రిద్ధి కుమార్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. ఇంకా అలాగే ఈ సినిమాలో వర్సటైల్ యాక్టర్ సత్యరాజ్, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌లు కూడా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో మంచి హైప్ క్రియేట్ కావడంతో ఈ సినిమాను సమ్మర్ కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఇక మే నెలలో ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తే, ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కుతుందని చిత్ర యూనిట్ చాలా నమ్మకంగా భావిస్తోందట. మరి నిజంగానే ఈ సినిమాను సలార్ మూవీ కంటే ముందే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారా అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది.ఇక ఈ ఇయర్ లో ఖచ్చితంగా ప్రభుస్ రికార్డులు నమోదు చెయ్యడం ఖాయం.ఈ ఏడాది ప్రభాస్ రికార్డులు మాములుగా ఉండవు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: