అఫీషియల్ : రావణాసుర ట్రైలర్ విడుదల తేదీ ప్రకటన..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ ఇప్పటికే ఈ సంవత్సరం వాల్టేరు వీరయ్య మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ లో రవితేజ పాత్ర నిడివి తక్కువే ఉన్నప్పటికీ ఈ పాత్రతో ప్రేక్షకులను రవితేజ ఎంత గానో ఆకట్టుకున్నాడు. వాల్టేర్ వీరయ్య మూవీ లో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం వాల్టేరు వీరయ్య మూవీ తో ప్రేక్షకులను అలరించిన రవితేజ మరి కొన్ని రోజుల్లో రావణాసుర మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 

సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ లో సుశాంత్ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. అను ఇమ్మానుయేల్ , ఫరియ అబ్దుల్లా , మేఘ ఆకాష్ , దక్ష నాగర్కర్ , పూజిత పొన్నాడ ఈ మూవీ లో హీరోయిన్ లుగా కనిపించనున్నారు. ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఈ సినిమా నుండి టీజర్ ను విడుదల చేసింది.

 ఆ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది. ఈ మూవీ యొక్క ట్రైలర్ ను మార్చి 28 వ తేదీన సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ చిత్త బృందం తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ లో రవితేజ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో నిలబడి ఉన్నాడు. రవితేజ వెనక భారీ మంటలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: