పోన్నియన్ సెల్వన్-2 ట్రైలర్ డేట్ లాక్..!!

Divya
తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం పోన్నియన్ సెల్వన్ -1 ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రం పీరియాడిక్ మూవీ గా మణిరత్నం డ్రీమ్ గా తెరకెక్కించారు. ఈ సినిమా తమిళ్లో రూ .200 కోట్లకు రూపాయలను కొల్లగొట్టింది. భాషతో సంబంధం లేకుండా PS -1 చిత్రం అదిరిపోయే రెస్పాన్స్ ను అందుకుంది. ఈ చిత్రం సీక్వెల్ కూడా ఉంటుంది అని తెలియజేశారు మణిరత్నం. తాజాగా ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమా విడుదల తేదీన అయితే ప్రకటించారు .. ఈ సినిమా ఏప్రిల్ నెలలో విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు చిత్ర బృందం తెలియజేశారు తాజాగా విచిత్రం ట్రైలర్ ని విడుదల చేసేందుకు ఒక డేట్ ను ప్రకటించింది చిత్ర యూనిట్ ఈ సినిమా ట్రైలర్ను ఈనెల 29వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించడం జరిగింది.పోన్నియన్ సెల్వన్-2 సినిమా ఇప్పుడు మరొక సారి సోషల్ మీడియాలో ట్రెండీ గా మారుతోంది. ఈ చిత్రంలో భారీ కాస్ట్యూమ్స్ నటిస్తూ ఉండడంతో ఈ సినిమా పైన భారీగానే అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఈ చిత్రంలో విక్రమ్, జయం రవి, కార్తీక్, త్రిష, ఐశ్వర్యరాయ్ తదితరులు సైతం నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు.పోన్నియన్ సెల్వన్-2 సినిమా ట్రైలర్ ఎలాంటి సెన్సేషనల్ క్రియేట్ చేస్తుందో అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి  ఈ ఏడాది సమ్మర్లో విడుదల కాబోతున్న ఎన్నో చిత్రాలకు పోటీగా ఈ సినిమా విడుదలవ్వడం జరుగుతోంది. మరి ఏ మేరకు అలాంటి సినిమాలన్నిటిని దాటుకొని మెప్పిస్తుందో చూడాలి మరి. ప్రస్తుతం అందుకు సంబంధించి లైకా ప్రొడక్షన్ నుంచి ఒక ట్వీట్ కాస్త వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: