క్రేజ్ మామూలుగా లేదుగా.. సుడిగాలి సుదీర్ ను దాటేసిన సుహాస్?

praveen
పాపులారిటీ అనేది పాసింగ్ క్లౌడ్ లాంటిది.. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది అని గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగులు సినిమా ఇండస్ట్రీకి బాగా సరిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఓవర్ నైట్ లో స్టార్లుగా ఎదిగిన వారు ఇక ఆ తర్వాత మాత్రం కనిపించకుండా పోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక మరికొంతమంది పాపులారిటీ కోసం పాకులాడుతూ ఇక ఒక్కసారిగా స్టార్లుగా మారిన వారు కూడా ఉంటారు అని చెప్పాలి. ఇక ఇలా స్టార్లుగా ఎదిగిన వారు ఎవరు కూడా లాంగ్ రన్ లో పాపులారిటీని కాపాడుకోలేరు అన్నది మాత్రం సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అది వెండితెరపై అయినా బుల్లితెరపై అయినా ఒకే విధంగా ఉంటుందని చాలామంది విషయంలో ప్రూఫ్ అయింది.

 బుల్లితెరపై ఒక రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న శ్రీముఖి, రష్మీ లాంటి వారు వెండితెరపై అస్సలు క్లిక్ అవ్వలేకపోయారు. బుల్లితెరపై స్టార్ కమెడియన్ గా హవా నడిపించిన షకలక శంకర్ వెండితెరపై పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయితే ఇద్దరు మాత్రం ఇప్పుడిప్పుడే మంచి స్టార్స్ గా ఎదుగుతున్నారు. వాళ్లే సుడిగాలి సుదీర్, సుహాస్. సుధీర్ బుల్లితెర జబర్దస్త్ కార్యక్రమం నుంచి వెండితెర వరకు ప్రయాణం సాగిస్తే.. సుహాస్ యూట్యూబ్ స్టార్ నుంచి హీరోగా మారాడు. గతంలో కలర్ ఫోటో సినిమాతో మంచి హిట్ కొట్టిన సుహాస్ ఇక రైటర్ పద్మభూషణ్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

 అయితే ఇక ఇప్పుడు సుహాస్ ఒక్కో సినిమాకి రెండు కోట్ల రూపాయల పారితోషకం డిమాండ్ చేస్తున్నారట. ఇక మరో ఆసక్తికర విషయం ఏమిటంటే నిర్మాతలు కూడా అంత మొత్తం ఇచ్చినందుకు సిద్ధమవుతున్నారట. కానీ మరోవైపు సుహాస్ కాల్ షీట్లు అస్సలు ఖాళీగా లేవట. దిల్ రాజు సుహాస్ తో సినిమా చేసేందుకు సిద్ధమైతే కాల్ షీట్లు లేవని చెబుతున్నాడట. మరోపక్క సుధీర్ కోటిన్నర వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఇలా సుహాస్ సుడిగాలి సుదీర్ ని పారితోషికం విషయంలో దాటేశాడు అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: