దాస్ కా ధమ్కీ: విశ్వక్ బాగానే కలెక్ట్ చేస్తున్నాడుగా?

Purushottham Vinay
యువ నటినటులు విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ హీరో, హీరోయిన్లుగా 'పాగల్' లాంటి హిట్ మూవీ వచ్చిన తర్వాత ఈ కాంబినేషన్ లో వచ్చిన మూవీ 'దాస్ కా ధమ్కీ'. హిట్ కాంబినేషన్ కాబట్టి అంచనాలు కూడా బాగానే వున్నాయి. ఈ సినిమాకి విశ్వక్ సేన్ దర్శకత్వం వహించాడు.'వన్మయే క్రియేషన్స్' 'విశ్వక్ సేన్ సినిమాస్' బ్యానర్లపై విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు ఇంకా విశ్వక్ సేన్ లు కలిసి ఈ సినిమాని రూ.20 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.విశ్వక్ సేన్ కెరీర్లో ఇది భారీ బడ్జెట్ మూవీ అని చెప్పాలి.తమిళ మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్ ఇంకా తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిర్యాల సంగీతంలో రూపొందిన ఈ సినిమాలోని పాటలకు కూడా చాలా మంచి స్పందన అనేది లభించింది.టీజర్ ఇంకా ట్రైలర్ లు బాగానే ఉండటంతో మార్చి 22 వ తేదీన ఉగాది కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమాకి మొత్తానికి యావరేజ్ టాక్ వచ్చింది. అయినా సినిమాకి కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి.


 ఫస్ట్ డే విశ్వక్ సేన్ కెరీర్లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ ను సాధించిన ఈ సినిమా.. ఇక రెండో రోజు కూడా చాలా బాగానే కలెక్ట్ చేసింది. ఒకసారి ఈ సినిమా 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే..ఇక 'దాస్ క ధమ్కీ' చిత్రానికి మొత్తం రూ.7.58 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే ఖచ్చితంగా రూ.8 కోట్ల దాకా షేర్ ను రాబట్టాలి.ఇక రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా మొత్తం రూ.5.5కోట్ల షేర్ ను రాబట్టింది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టాలి.నిన్న గురువారం నాడు వీక్ డే అయినా కూడా ఈ మూవీ బాగానే హోల్డ్ చేసింది.ఈ వీకెండ్ కు మళ్ళీ గ్రోత్ పెరిగితే తప్ప బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు లేవు. అయితే ఈ సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.మరి చూడాలి ఈ సినిమా ఎంత వరకు వసూళ్ళని నమోదు చేస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: