ఆ మూవీ అప్డేట్ల గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్..!

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఆయన స్టార్ స్టామినా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించిన రామ్ చరణ్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే "ఆర్ ఆర్ ఆర్" మూవీ తో గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. కియార అద్వానీ ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో వినయ విధేయ రామ అనే మూవీ రూపొందింది. రామ్ చరణ్ ... శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా రామ్ చరణ్ ... కియార కాంబినేషన్ లో రెండవ మూవీ. రామ్ చరణ్ ... శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ కి ఇప్పటివరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు.

 దానితో ఈ మూవీ షూటింగ్ "ఆర్ సి 15" అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం జరుగుతుంది. ఈ మూవీ కి సంబంధించిన టైటిల్ ను ఈ సంవత్సరం రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర బృందం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి "సీఈవో" అనే టైటిల్ ను ఈ చిత్ర బృందం ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మెగా అభిమానులు ఈ సినిమా అప్డేట్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి మెగా అభిమానులు ఎదురుచూస్తున్న అప్డేట్ ను ఈ  చిత్ర బృందం రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేస్తుందో ... లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: